Big alert:.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు

by Phanindra |   (  Updated:2023-06-23 03:45:01  IST  )

మొన్నటి వరకు అమ్మో ఎండ బాబోయ్ అనుకున్నాం..

Big alert:.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మొన్నటి వరకు అమ్మో ఎండ బాబోయ్ అనుకున్నాం.. నేడు వాన బాబోయ్ అని.. అనుకుంటున్నాం. ఒక రకంగా వాతావరణం చల్లబడి మనకి మంచే చేసింది లేదంటే ఎండ దెబ్బకి ఎంతో మంది విల విల లాడిపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న విషయం మనకి తెలిసిందే. రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు, రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story