- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం
రాష్ట్రంలోని గ్రూప్-3 (Group-3) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి గాను ఇటీవలే జనరల్ ర్యాకింగ్స్‌ను విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని గ్రూప్-3 (Group-3) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి గాను ఇటీవలే జనరల్ ర్యాకింగ్స్‌ను విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోను ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫెకెట్ల పరిశీలన పక్రియ నేటి నుంచి ఈ నెల 26 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమై సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనుంది. సర్టిఫికెట్ పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో పొందుపరిచారు. అందులో హాల్‌టికెట్ నంబర్లను పేర్కొన్నారు. అయితే, ఆ నంబర్ల ఆధారంగానే అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. వచ్చేప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను మాత్రమే తీసుకురావాలని కమిషన్ కార్యదర్శి ప్రియాంక సూచించారు.






