- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటకులకు బిగ్ అలర్ట్.. శ్రీశైలం గేట్లు మూసివేత
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నది (Krishna river)పై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి. ఈ క్రమంలో జూరాల, శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం వరద ఉధృతి (Flood surge) పూర్తిగా తగ్గిపోవడంతో అప్రమత్తమైన అధికారులు ఈ రోజు ఉదయం శ్రీశైలం గేట్లను మూసివేశారు. ఈ నెల 8న సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు గంగా హారతి చేసిన తర్వాత అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఈ నెల 12 వరద ఉధృతి తగ్గడంతో మూడు గేట్లను మూసేసిన అధికారులు కేవలం ఒక్క గేటును తెరిచి ఉంచి నీటిని వదిలారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఎగువ నుంచి వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు ఒక్క గేటును కూడా మూసివేశారు. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
- Tags
- srishailam dam






