- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశావహులకు బిగ్ అలర్ట్.. సర్పంచ్ ఎన్నికలపై మరో కీలక అప్‌డేట్
తెలంగాణలో స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలపై (Sarpanch Elections) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) కీలక తీర్పు (Verdict) వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలపై (Sarpanch Elections) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) కీలక తీర్పు (Verdict)ను వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 90 రోజుల్లో సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ధర్మాసనం సర్కార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి మరో కీలక అప్‌డేట్ అందింది. బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను యుద్ధ ప్రాతిపదకన సిద్ధం చేయాలని తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, ఇతర సామగ్రితో పాటు పూర్తి సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో తమకు పంపాలని ఈసీ మర్గదర్శకాలు జారీ చేసింది.
కాగా, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj Department) ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. పంచాయతీలు, వార్డుల సంఖ్య మరింత పెరగటంతో పూర్తిస్థాయి పక్కా సమాచారంతో జాబితాను తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పంచాయతీ కార్యదర్శి స్థాయిలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించనున్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను తయారు చేసి నేరుగా ఎంపీడీవో (MPDO) లాగిన్ ద్వారా టీపోల్ (T-Poll) సాఫ్ట్‌వేర్‌లో చేర్చారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య పెంచాలని సర్కార్‌కు పెద్ద ఎత్తున వినతులు రావడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామాలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా మారే అవకాశం ఉంది.
Also Read..






