రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్..నేటి నుంచి తీవ్రంగా ఎండలు

by velandi.Saikiran |

Telangana: నేటి నుంచి ఎండల తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్..నేటి నుంచి తీవ్రంగా ఎండలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి ఎండల తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల దాకా పెరుగుతాయని స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు ఎండల తీవ్రత ఇలాగే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ లెక్క ప్రకారం 47 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇవాళ కూడా చాలా జిల్లాల్లో ఇంత కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సైతం సూచనలు చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అస్సలు బయటకు రాకూడదని కోరుతున్నారు.

Next Story