రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ రోజు నుంచి చురుకైన వర్షాలు

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ రోజు నుంచి చురుకైన వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ నిపుణుల (వాతావరణ నిపుణుల) నుంచి మరో అలర్ట్ (Alert) జారీ అయింది. ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తాయని అంచనా వేశారు. ఇందులో భాగంగా.. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, జనగాం మంచిర్యాల, ఆసిఫాబాద్ (ప్రధానంగా రాత్రిపూట)లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి - భోంగిర్, సిద్దిపేట, రంగారెడ్డిలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయం తర్వాత రాత్రిపూట అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

Next Story