- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన
రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) పేర్కొంది. అలాగే, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మబ్బులు కమ్ముకువటంతో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు (Orange and red alerts) జారీ చేసింది. కాగా వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.






