తెలంగాణ నిరుద్యోగులకు BIG.. ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్‌’కు అప్లై చేశారా?

by Gantepaka Srikanth |

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువు తేదీ సోమ‌వారం (ఏప్రిల్14)తో ముగియ‌నున్న‌ది.

తెలంగాణ నిరుద్యోగులకు BIG.. ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్‌’కు అప్లై చేశారా?
X

దిశ‌, తెలంగాణ బ్యూరో: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువు తేదీ సోమ‌వారం (ఏప్రిల్14)తో ముగియ‌నున్న‌ది. దీంతో ఈ ప‌థ‌కానికి ధ‌ర‌ఖాస్తు తేదీని పొడ‌గించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్య‌క్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఎన్ ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి వేడుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం సీఎం, టీపీసీసీ అధ్య‌క్షుల‌కు బహిరంగ అభ్యర్థన లేఖ రాశారు.

రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతకు ఆశాజ్యోతి కలిగించిన "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని ప్రారంభించినందుకు తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యువతకు నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా సాధికారత కల్పించేందుకు రూపుదిద్దిన ఈ పథకం, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా యువజన సంక్షేమానికి మార్గదర్శకంగా నిలువ‌నుంద‌న్నారు. ఈ పథకం మీ ఆధునిక దృష్టికోణాన్ని, యువత ఆకాంక్షలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందన్నారు. యువతను ఆత్మనిర్బరులుగా తీర్చిదిద్దే ఈ సంకల్పం, రాష్ట్ర యువతలో విశేష ప్రశంసలు పొందుతోందని. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 14, 2025తో ముగియనున్న దరఖాస్తుల గడువు తేదీని మరో 10 రోజుల పాటు పొడిగించాలని అభ్య‌ర్థించారు.

ప్రస్తుతం, క్షేత్ర స్థాయిలో అనేక అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను, ముఖ్యంగా ఎంఆర్ ఓ కార్యాలయాలు, సంబంధిత శాఖల నుండి, సమయపూర్వకంగా పొందడంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి అర్హులైనా యువకులకి అందించాలన్న సంకల్పాన్ని నిలబెట్టుకునేందుకు గడువు తేదీని మరో 10 రోజుల పాటు పొడిగించాల్సిన అవసరం ఉంద‌ని లేఖ‌లో వేడుకున్నారు.

Next Story