తెలంగాణ గ్రూపు-1 అభ్యర్థులకు BIG అలర్ట్

by Gantepaka Srikanth |

గ్రూపు-1 నియామకాలపై(Group-1 Recruitment) తెలంగాణ హైకోర్టు(High Court)లో శుక్రవారం విచారణ జరిగింది.

తెలంగాణ గ్రూపు-1 అభ్యర్థులకు BIG అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 నియామకాలపై(Group-1 Recruitment) తెలంగాణ హైకోర్టు(High Court)లో శుక్రవారం విచారణ జరిగింది. వచ్చే జూన్ 11వ తేదీ వరకు గ్రూపు-1 నియామకాలపై స్టే కొనసాగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గ్రూపు-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నియామకాలపై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయితే.. జూన్ 11న ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీజీపీఎస్సీ వాదనలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు స్టే ఎత్తివేస్తుందా లేదా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసుపై వెలువడే తీర్పు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.

Next Story