- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: టెన్త్ పూర్తయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్
రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ 2026 పరీక్ష మే 3 న జరగనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ 2026 పరీక్ష మే 3 న జరగనుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశం కల్పించే ఈ పరీక్షకు ఇప్పటివరకు సుమారు 45 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ధరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్: https://tgrjc.cgg.gov.in/, ఇతర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను చూడవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 7842991708, 18004252428 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.






