- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మరోసారి ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
by Kema Shiva Kumar |
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్‌లో చేరే విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపికబురు చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్‌లో చేరే విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపికబురు చెప్పింది. ఈ మేరకు ఇంటర్ అడ్మిషన్ల (Intermediate Admissions) దరఖాస్తు గడువు పెంచుతూ ఇవాళ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం అప్లికేషన్ల గడువును ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లుగా సర్క్యులర్ వెలువడింది. ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఉన్న కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు అధికారుల విద్యార్థలు తల్లిదండ్రులకు సూచించారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అనుబంధ గుర్తింపు ఉన్న ఇంటర్ కళాశాల జాబితా అందుబాటులో ఉంటుందని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
Next Story






