విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 7న ఐసెట్ ఫలితాలు

by Kema Shiva Kumar |

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్-2025 ఫలితాలు ఈనెల 7న విడుదల కానున్నాయి.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 7న ఐసెట్ ఫలితాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్-2025 ఫలితాలు ఈనెల 7న విడుదల కానున్నాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఐసెట్ కన్వినర్ మహాత్మాగాంధీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవి, వీసీ, ఇతర ఉన్నతాధికారులు మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 71,746 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకోగా, 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు https://icet.tgche.ac.in వెబ్‌సైట్ అందుబాటులో ఉండనున్నాయి.

Next Story