విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజునే EAPCET ఫలితాలు

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET-2025 పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజునే EAPCET ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET-2025 పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫలితాలను ఈనెల 15న విడుదల చేయనున్నారు. అగ్రికల్చర్, ఫార్మాసీ విభాగంలో 93.59 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 94.04 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రాత్రం, రెస్పాన్స్ షిట్లను అధికారులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఇవాళ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కీని విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా EAPCET పరీక్షకు 3,06,796 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇంజనీరింగ్ (Engineering) విభాగానికి 2,20,049, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (Agriculture and Pharmacy) విభాగంలో 86,493, ఆ రెండు విభాగాలకు కలిపి 254 అప్లికేషన్లు అందాయి.

Next Story