రాష్ట్రంలోని తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 21న ప‌ల్స్ పోలియో కార్యక్రమం

by Kema Shiva Kumar |

‘రెండు చుక్కలు - నిండు జీవితం’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 21న జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 21న ప‌ల్స్ పోలియో కార్యక్రమం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రెండు చుక్కలు - నిండు జీవితం’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 21న జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 ఏళ్ల లోపు 54 లక్షలకు‌పైగా పిల్లలకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ (OPV) చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 38,267 పోలియో బూత్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రోడ్ల జంక్షన్ల వద్ద ట్రాన్సిట్ బూత్‌లు కూడా ఉంటాయి.

కాగా, ఇప్పటికే అన్ని జిల్లాలకు 61,26,120 డోసుల పోలియో డ్రాప్స్‌ను పంపిణీ చేశారు. మొదటి రోజు బూత్‌ల వద్ద టీకాలు వేసిన తర్వాత, రెండు మూడు రోజులు ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమం జాతీయ ఇమ్యునైజేషన్ డే (NID) భాగంగా జరుగుతోంది. భారతదేశం 2014 నుంచి పోలియో ముక్త దేశంగా ఉన్నప్పటికీ, పొరుగు దేశాల్లో ఇంకా కేసులు నమోదవుతుండటంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్ల లోపు పిల్లలను తప్పనిసరిగా సమీప బూత్‌కు తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తగా పోల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావాలంటే రాష్ట్రంలోని తల్లిదండ్రులంతా తప్పనిసరిగా సహకరించాలని వైద్యాధికారులు కోరారు. " అనే నినాదంతో ఈ డ్రైవ్ కొనసాగుతోంది.

Next Story