- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టికెట్ ధరలు పెంపు
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో యాదిగిరిగుట్ట(Yadadri Temple) ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో యాదిగిరిగుట్ట(Yadadri Temple) ఒకటి. ఈ ఆలయానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. భక్తుల తాకిడి భారీ స్థాయిలో పెరిగింది. తాజాగా యాదాద్రికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం(Satyanarayana Swamy Vratham) టికెట్ ధరలు పెంచారు. ఇప్పటివరకు రూ.800 ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను రూ.1000కి పెంచారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భక్తుల భక్తిశ్రద్ధలకు మరోసారి సాక్ష్యం చెప్పింది. ఆలయ హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ఈఓ వెంకట్రావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి 41 రోజుల హుండీ లెక్కింపులో రూ.2 కోట్ల 45 లక్షల 48 వేల 023 రూపాయల నగదు లభించిందని తెలిపారు. కేవలం నగదు మాత్రమే కాదు, 38 గ్రాముల బంగారం, 2 కిలోల 800 గ్రాముల వెండిని కూడా భక్తులు సమర్పించినట్లు చెప్పారు.






