- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ శ్రేణులకు బిగ్ అలర్ట్.. కామారెడ్డి బీసీ మహా గర్జన సభ వాయిదా
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికార కాంగ్రెస్ కామారెడ్డి (Kamareddy) వేదికగా బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికార కాంగ్రెస్ కామారెడ్డి (Kamareddy) వేదికగా బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ సభతో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పక్కగా వ్యూహ రచన చేసింది. ఈనెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తుండగా.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సభను తాత్కాలికంగా వాయిదా వస్తున్నట్లుగా ఇవాళ ప్రకటించింది. సభకు హారజరయ్యే కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి సభను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.






