- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరవాసులకు బిగ్ అలర్ట్.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు షురూ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు (Drunken Driving Tests) ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్, ఐమాక్స్ రోడ్, దోమలగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రాత్రి 7 గంటల నుంచి మొదలు పెట్టారు. నగరవ్యాప్తంగా మొత్తం 120 కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను పకడ్బందీగా మోహరించారు.
ఇక మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ తాగి వాహనం నడుపుతూ దొరికితే రూ.10 వేల జరిమానా, వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు 6 నెలల పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి శిక్షలు విధించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత క్యాబ్‌లు లేదా ఇతర సురక్షిత మార్గాలు ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. నగరవాసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సహకరించి, రోడ్డు భద్రతకు భాగస్వాములు కావాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.






