అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

by Kema Shiva Kumar |

గ్రూప్-1 (Group-1) మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 (Group-1) మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది. కేసులో వాదనలు త్వరగా ముగించాలని సంబంధిత న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారని కోర్టు పేర్కొంది. అయితే, పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకణంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వారు దాఖలు చేసిన పిటిషన్‌లో వెల్లడించారు. అయితే, గత నెల అభ్యర్థుల పిటిషన్లపై వాదనలు కొనసాగిన నేపథ్యంలో రీ వాల్యేయేషన్ లేదా మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ (TGPSC) తరఫున కలుగుజేసుకుని ఇప్పటికే నిపుణులతో మూల్యాంకనం చేయించామని.. కానీ అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా గ్రూప్-1 నియామకాలు ఆలస్యమైతే అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయవచ్చని హైకోర్టు ఆదేశించింది. కాగా, గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని గ్రూప్-1కు ఎంపికైన నలుగురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు టీజీపీఎస్సీ సమయం కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.

Next Story