- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 పిటిషన్లపై రేపు తుది తీర్పు
గ్రూప్-1 నియామకం కోసం ఎంతోకాలంగా అభ్యర్థులు ఎదరుచూస్తున్న నిరీక్షణకు తెర పడనుంది. నేడు గ్రూప్-1 నియామకాలకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 నియామకం కోసం ఎంతోకాలంగా అభ్యర్థులు ఎదరుచూస్తున్న నిరీక్షణకు తెర పడనుంది. రేపు గ్రూప్-1 నియామకాలకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వులో ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు. గత రెండు నెలలుగా అభ్యర్ధులు తీర్పుకోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని, పలు అభ్యంతరాలను పేర్కొంటూ పరీక్షలు రద్దు చేయాలని కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణ జరుగుతుండగా గ్రూప్-1 నియామకాలు చెపట్టాలని మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై పలుమార్లు సుధీర్ఘంగా విచారణలు జరిగాయి. నేటి తీర్పుతో ఉత్కంఠకు తెర పడనుంది.






