అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 10 నుంచి 17 వరకు దరఖాస్తుల స్వీకరించాల్సి ఉండగా.. తాజాగా వైద్యుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల‌ 20 నుంచి 27 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకోనున్నట్లుగా ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేసింది. అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ అప్లికేషన్‌తో పాటు అన్ని సర్టిఫికెట్లను అప్‌‌లోడ్ చేయాలని అధికారులు సూచించారు. అయితే, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధృవీకరణ, ఇతర సర్టిఫికెట్లు సమకూర్చుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో దరఖాస్తు స్వీకరణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది.

Next Story