ఎవరినో బ్లేమ్ చేయబోయి.. ఇంకెవరినో చేస్తున్నారు: జగన్‌కు MP చామల కౌంటర్

by Gantepaka Srikanth |

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్పందించారు.

ఎవరినో బ్లేమ్ చేయబోయి.. ఇంకెవరినో చేస్తున్నారు: జగన్‌కు MP చామల కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్పందించారు. రాహుల్‌(Rahul Gandhi), చంద్రబాబు మధ్య రేవంత్‌రెడ్డి హాట్‌లైన్‌లో ఉంచడం వల్లే ఏపీ ఎన్నికలపై రాహుల్ మాట్లాడలేదంటూ జగన్ వ్యంగంగా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 18వ లోక్‌సభను కాపాడటానికే చంద్రబాబు ఎన్డీఏలో చేరారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 275 దాటడానికి, మోడీ సర్కారు అధికారంలో ఉండటానికి చంద్రబాబు కారకులు అని చెప్పారు.

ఏపీలో ఏమైనా తప్పులు జరిగితే... ఎన్నికల్లో ఓటమికి కారణాలపై ఈసీ, మోడీ, అమిత్‌ షాలను బ్లేమ్ చేయాలి.. వాళ్లను వదిలేసి రాహుల్‌ను బ్లేమ్ చేస్తూ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. హర్యానా, మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలు దౌర్భాగ్యంగా ఉంటున్నాయని రాహుల్ అంటున్నారు. అలాంటిది మీరు రాహుల్‌గాంధీ మద్దతు ఇవ్వాల్సిపోయి విమర్శలు చేయగడం సబబు కాదన్నారు. ఎన్నికలు జరిగిన విధానంలో నిజంగా జగన్‌కు అనుమానం ఉంటే.. విజయవాడలో జరిగే ధర్నాలో జగన్‌ కూడా రాహుల్‌గాంధీతో కలిసి పాల్గొనాలి. అంతేతప్ప తెలుగు రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడవద్దు. రాహుల్‌ ప్రధాని మంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Next Story