- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 మంది కేసీఆర్‌లు వచ్చినా.. నా గెలుపును ఆపలేరు: భట్టి స్ట్రాంగ్ కౌంటర్
భట్టి విక్రమార్క గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదంటూ మధిర బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మధిరలో

X
దిశ, వెబ్‌డెస్క్: భట్టి విక్రమార్క గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదంటూ మధిర బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మధిరలో కాంగ్రెస్ విజయభేరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మధిరలో నేను గెలవనని సీఎం కేసీఆర్ సభలో చెప్పారు.. కానీ వందమంది కేసీఆర్‌లు వచ్చినా.. మధిర గేట్లు కూడా తాకలేరని భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా గెలుపును ఎవరూ ఆపలేరని భట్టి దీమా వ్యక్తం చేశారు. మధిర పోరాటాలు, పౌరుషాల గడ్డ అని నొక్కి చెప్పారు. ఈ సారి దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్యే ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలు దోచుకున్నదంతా ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. దొరల తెలంగాణ పోయి.. ప్రజా తెలంగాణ రావాలని అన్నారు.
Next Story






