- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti: అలాంటి వారికే టికెట్లు.. మున్సిపల్ అభ్యర్థులపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
పార్టీ జెండాను భుజాన మోసేవారంతా కాంగ్రెస్ పార్టీ వారేనని భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‍ను ఆదరించినట్లే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అందరి కంటే మెజారిటీ సీట్లు తమకే ఇవ్వబోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. విద్యా, ఆరోగ్యంతో పాటు నగరాల్లో మౌలికాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుపోతున్నామని రాష్ట్రంలో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులను తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చామని అన్నారు. తెలంగాణ ప్రగతి కోసం క్యూర్, ప్యూర్, రేర్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. అందరి ఏకాభిప్రాయంతో మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ బాధ్యతను సంబంధింత ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ డాక్యుమెంట్ పేరుతో ప్రణాళికను విడుదల చేశామన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటి అర తప్ప మిగతావి అన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.
కాంగ్రెస్‍వే మెజారిటీ సీట్లు:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిర్ణయాలు జరుగుతాయన్నారు. ఆయన ఆయా పార్టీలతో చర్చించి పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రజాభవన్‍లో మంత్రు భేటీపై స్పందిస్తూ మా మంత్రులు నాతో ప్రయాణం చేయకుంటే ఆ వార్తలు రాసే వారితో ప్రయాణం చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యంత్రి ఊర్లో లేకు కాబట్టి పాలనపరమైన అంశంలో చర్చించేందుకే కలిశామన్నారు. ఈ విషయంలో కథనాలు రాసిన వారివి పిచ్చి భ్రమలు అన్నారు. ఈ రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంగా ఉందని మా అందరి సంక్షేమం రాష్ట్ర సంక్షేమంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామన్నారు. చేరికలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరుగుతున్న వారంతా కాంగ్రెస్ పార్టీ వారేనని భట్టి విక్రమార్క అన్నారు. సాధ్యమైనంత వరకు నిబంధతతో పని చేసే వారికి న్యాయం చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తుందన్నారు.






