హరీష్ రావు కుంగిపోయారు.. దానికి రీజన్ నాకు తెలుసు: డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

అసెంబ్లీలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

హరీష్ రావు కుంగిపోయారు.. దానికి రీజన్ నాకు తెలుసు: డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడారు. నీళ్ల కోసమే ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై పారదర్శకంగా చర్చ జరగాలని బీఆర్ఎస్ సభ్యులకు లేదా? అని ప్రశ్నించారు. చెప్పాల్సిందంతా చెప్పి తొండి చేస్తామంటే ఎలా? సభను శాసిస్తామంటే సరికాదని హితవు పలికారు. సభలో చర్చకు వస్తుంటే అల్లరి చేస్తున్నారు. లక్ష కోట్ల దోపిడి చేశారు. కట్టిన పది రోజుల్లోనే కోల్పోతే ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. జస్టిస్ ఘోష్ రిపోర్టుపై మాత్రమే మేము మాట్లాడాం. రాజకీయ ఆరోపణలు చేయలేదు, కక్ష సాధింపులు లేవు. జస్టిస్ ఘోష్‌పై కూడా హరీష్ రావు అపవాదులు వేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని తమకు ఉండి ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో అది చేసేవాళ్లమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల్లాగా తమకు మభ్యపెట్టడం రాదని చెప్పారు.

‘రీడిజైన్ పేరుతో ప్రతి ప్రాజెక్టును చీల్చి చెండాడారు. ఇవన్నీ పెంచి అదనంగా నీళ్లు ఇచ్చారా? అంటే అదీ లేదు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరాకుండా పోయాయి. ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లాగా కుంగిపోయారు. నిటారుగా నిలబడలేక పోతున్నారు. దానికి రీజన్ ఏంటో మన అందరికీ తెలుసు’ అని భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కాళేశ్వరం మీ కోసమే.. ప్రజల కోసం కాదు.. కనీసం కేబినెట్ అప్రూవల్ కూడా లేదు. కుంగిపోకముందే NDSA కొన్ని సూచనలు చేసింది. NDSA సూచనలను కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ చెప్పారు, హరీష్ రావు కట్టారు.. కమిషన్ మమ్మల్ని పిలవలేదని హరీష్ రావు చెబుతున్నారు. ఎవరైనా రావచ్చని కమిషన్ ఓపెన్‌గా ప్రకటనలు ఇచ్చింది’ అని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

Next Story