- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka : రేపు కర్నూలులో భట్టి విక్రమార్క పర్యటన
తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధనవనరులశాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) రేపు ఏపీలోని కర్నూలు(Karnul Tour) జిల్లాలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధనవనరులశాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) రేపు ఏపీలోని కర్నూలు(Karnul Tour) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు జిల్లాలోని గుమ్మితం తండాలో గల గ్రీన్‌కో గ్రూప్ యొక్క ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (IRESP)ను సందర్శించి, పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌గా పేరు పొందింది. 2023లో పూర్తయిన ఈ ప్రాజెక్ట్.. 5,230 మెగావాట్ల సామర్థ్యంతో 3,000 మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్, 1,680 మెగావాట్ల హైడ్రో పవర్‌ను కలిగి.. రోజుకు 10,800 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.
తెలంగాణలో 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో.. అందుకోసం సరికొత్త సాంకేతికతలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా అధికారులతో కలిసి భట్టి ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీని బలోపేతం చేసేందుకు సాంకేతిక, వాణిజ్య అంశాలను పరిశీలించనున్నారు. భట్టి విక్రమార్క గతంలో జపాన్‌లో యమనాషి గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని సందర్శించి.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నారు.






