- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలి : కాసం వెంకటేశ్వర్లు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టిమార్క తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టిమార్క తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భట్టి విలువలు గల రాజకీయ నాయకుడు అనుకున్నాం గాని ఇంత నీచ రాజకీయాలకు దిగుతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇపుడు అకస్మాత్తుగా రోహిత్ వేముల మరణాన్ని ఎందుకు ప్రస్తావించారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఆ కేసును కోర్టు తీర్పు ప్రకారం మూసి వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని భట్టి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మూసి వేసిన కేసుపై ఇప్పుడు రామచందర్ రావుపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో తక్షణమే భట్టి క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కాగా హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల మరణనానికి పరోక్షంగా కారణం రామచంద్ర రావే అంటూ ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.






