- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో 55 స్కూల్స్ వచ్చేశాయ్! భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఖమ్మం జిల్లా నేతలు, మంత్రులతో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) రూ.11,600 కోట్లతో 55 పాఠశాల నిర్మాణం కోసం మంజూరు చేస్తున్నట్లు (CM Revanth Reddy) సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జీవో విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇంటర్‌నేషనల్ లేవల్, టెక్నాలజీతో వచ్చే ఇటు వంటి రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేటులోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదన్నారు. ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణం, అద్భుతమైన క్రీడా మైదానాలు, టీచింగ్ చెప్పే స్టాఫ్ కూడా అక్కడే ఉండే విధంగా కావాల్సిన వసతులు కల్పిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ ఎడ్యూకేషన్, మినీ థియేటర్ సహా అధ్యుతమైన డిజైన్ చేసి.. పేద విద్యార్థుల కోసం అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల నిర్మాణం ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే సిలబస్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని శాసించే కంపెనీల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచనలతో విద్యపై ఫోకస్ పెట్టామని చెప్పారు. సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా కూడా.. ప్రతి పైసా ప్రజల కోసం ఎలా ఖర్చు చేయాలా? అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలను వినియోగించుకోవాలని సూచించారు.






