- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti Vikramarka: రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు భాగం కావాలి: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులకు స్వర్గదామం అని భట్టి చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఆధునిక, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఈ అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ లోని ఒక ప్రైవేట్ హోటల్ లోని సీఐఐ నిర్వహించిన సీఎఫ్ఓ కాంక్లేవ్ లో (CFO Conclave) పాల్గొని మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులకు స్వర్గదామం అని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు ప్రొగ్రెసివ్ పాలసీలు, అనుకూల పర్యావరణ వ్యవస్థ ఇక్కడ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, చేనేత రంగాలలో పారిశ్రామిక సమూహాలను ప్రోత్సహించడానికి ప్రాంతీయ రింగ్ రోడ్డును అభఇవృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలకు సీఎఫ్ వోలు, సీఐఐ ప్రతినిధులు సహకరించాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం ఉండబోతున్నదని చెప్పారు.






