Bhatti Vikramarka: ఇవాళ్టి నుంచే రైతు భరోసా.. భట్టి విక్రమార్క బిగ్ అప్ డేట్

by Prasad Jukanti |   (  Updated:2025-06-16 12:28:43  IST  )

రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka: ఇవాళ్టి నుంచే  రైతు భరోసా.. భట్టి విక్రమార్క బిగ్ అప్ డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయానికి విడదీయలేని సంబంధం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, ఉచిత కరెంట్, రైతురుణమాఫీ, మద్దతు ధర అని చెప్పారు. ఇవాళ రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రామాని చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేసి చూపించామని, రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరమైన ఇబ్బందులుున్నా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 74 వేల కోట్ల రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోలేదని రైతుల పంటల నష్టంపై ఎన్ని సార్లు డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రైతుబంధును పెండింగ్ లో పెట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాసంగి రైతుబంధును రైతుల ఖాతాల్లో వేసిందని గుర్తు చేశారు. ఇవాళ్టి నుంచి వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయబోతున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వబోతున్నామని ఎకరాలవారీగా కాక అందరికీ ఒకేసారి రైతుభరోసా విడుదల చేస్తామన్నారు. 9 రోజుల్లోనే రైతులందరికి అకౌంట్లలోకి రైతు భరోసా (Rythu Bharosa) నగదు జమ చేయబోతున్నట్లు చెప్పారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. ప్రజలు మంచి జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక కళ్లలో నిప్పులు పోసుకుంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకత్వం చుట్టూ ఉన్నదంతా దెయ్యాలు అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని, గ్రామాలు సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండాలంటే ఈ దెయ్యాలను ఊరి పొలిమేరలకు రానివ్వొద్దన్నారు.

Next Story