Assembly: వెల్‍లో చప్పట్లు కొడుతూ బీఆర్ఎస్ నిరసన.. భట్టి విక్రమార్క సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2026-03-28 14:48:47  IST  )

సభలో చప్పట్లు కొడుతూ బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

Assembly: వెల్‍లో చప్పట్లు కొడుతూ బీఆర్ఎస్ నిరసన.. భట్టి విక్రమార్క సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శనివారం శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్ స్ట్రక్షన్స్' పై బీఆర్ఎస్ వర్సెస్ అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ చేపడుతున్న పనులు, మైనింగ్ అక్రమాలు మరియు టెండర్లలో జరుగుతున్న అవకతవకలపై తక్షణమే హౌస్ కమిటీ (House Committee) వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్ లోని దూసుకువచ్చి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రోడ్లపై అల్లరి చేసినట్లు బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందని ఆక్షేపించారు. వెల్ లోకి వచ్చి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేయడం ఇదెక్కడి సంప్రదాయం? పవిత్రమైన సభలో చిన్నపిల్లలాట లాంటి ఈ వ్యవహారం ఎక్కడిదన్నారు.

ఇది పద్దతి కాదు:

మీరు చేసిన ఆరోపణలన్నీ వాస్తవం అనుకుంటే ఎలా అని భట్టి ప్రశ్నించారు. ప్రతిపక్ష బాధ్యతతో మీరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ఎలా వెళ్లాలో అలా ముందుకు వెళ్తుందన్నారు. బీఆర్ఎస్ తీరు సభను యావత్ ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరుస్తోందన్నారు. బీఆర్ఎస్ బాధ్యత రాహిత్యాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం చూస్తోందన్నారు. బీఆర్ఎస్ చెప్పినట్లుగానే స్పీకర్ వ్యవహరించాలని, వారి ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించడం కుదరదన్నారు. ఇదేం పద్దతి అని మండిపడ్డారు.

పోలీసు శాఖ సీఎం వద్దనే ఉండి కూడా ఇంత నిర్లక్ష్యమా?.. సభ నుండి బీఆర్ఎస్ వాకౌట్

Next Story