ప్రజా ఆశలు, అభిలాషలు నెరవేర్చే ఏకైక పార్టీ కాంగ్రెస్: డిప్యూటీ సీఎం భట్టి

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా యూసుఫ్‌గూడా, మధురానగర్, మూసాపేట్ ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ప్రజా ఆశలు, అభిలాషలు నెరవేర్చే ఏకైక పార్టీ కాంగ్రెస్: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా యూసుఫ్‌గూడా, మధురానగర్, మూసాపేట్ ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక పండ్ల వ్యాపారులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి, న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజా ఆశలు, అభిలాషలు నెరవేర్చగల ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, వాకిటి శ్రీహరి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, జూబ్లీహిల్స్​ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్​బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్తున్నది. నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న బీసీల ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుంది.

Next Story