కాంగ్రెస్ ​డ్రాప్టింగ్ కమిటీ భేటీకి హాజరైన భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

కాంగ్రెస్​పార్టీ ​డ్రాప్టింగ్ కమిటీ భేటీ అయ్యింది.

కాంగ్రెస్ ​డ్రాప్టింగ్ కమిటీ భేటీకి హాజరైన భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​పార్టీ ​డ్రాప్టింగ్ కమిటీ భేటీ అయ్యింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఏఐసిసి కార్యాలయంలో డ్రాప్టింగ్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అయితే, ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసిసి కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని ఈనెల 24న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేజీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ కీలక కమిటీలో పార్టీ పట్ల నిబద్ధత, రాజకీయ నైపుణ్యం, అనుభవం, ఉన్నత విద్యావంతుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు స్థానం కల్పించారు.

ఏఐసీసీ నిర్వహించనున్న కీలక సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధానాలు, రాజకీయ నిర్ణయాలు రూపొందించడంలో డ్రాప్టింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. పార్టీ రాజకీయ మ్యానిఫెస్టో, సంస్థాగత మార్పులు, రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను డ్రాఫ్టింగ్ కమిటీలో చర్చించనున్నారు. ఏప్రిల్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది, ఆ తర్వాత ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.

Next Story