- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fee Reimbursement: సీఎం రేవంత్ రెడ్డితో భట్టి, శ్రీధర్ బాబు భేటీ.. తెరపైకి కేసీఆర్ విజిలెన్స్ రిపోర్టు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశంపై వీరు చర్చించారు. ఫీజు బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు కాలేజీల బంద్ పాటిస్తున్నాయి. ఈ విషయంలో నిన్న కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపిన భట్టి విక్రమార్క, శీధర్ బాబు ఇవాళ సీఎంతో సమావేశం అయ్యారు. బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని విధ్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కాలేజీలు సమ్మె విరమించి యధావిధిగా తరగతులు నిర్వహించాలని సీఎం తెలిపినట్లు సమాచారం.
తెరపైకి కేసీఆర్ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్:
బకాయిలు చెల్లించే విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ కాలేజీల యాజమాన్యాల తీరులో మార్పు లేకపోవడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీల విద్యావ్యవస్థ, నాణ్యత ప్రమాణాలపై గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన విజినెల్స్ కమిషన్ రిపోర్టు (KCR Vigilance Commission) ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కాలేజీలు వినియోగించుకుంటున్నాయని, ప్రతి ఏటా ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీల తనిఖీలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయంటున్న విద్యార్థి సంంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇటీవల ఇంజినీరింగ్, వృత్తి విద్య కోర్సుల ఫీజుల విషయంలోనూ కాలేజీల యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ రిపోర్టుపై తాజాగా ఆరాతీస్తున్నట్లు సమాచారం.






