- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి (క్యాంప్ కార్యాలయం) వెళ్లిన భట్టి విక్రమార్క.. తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు.
వివాహ వేడుకకు ఆహ్వానం
మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన భట్టి విక్రమార్క, తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ భేటీలో భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఉభయ రాష్ట్రాల నేతల మధ్య ఈ భేటీ ఆత్మీయంగా సాగింది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడితో భేటీ
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని కూడా భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి, వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.






