- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rythu Bharosa : అకౌంట్లలోకి అర్ధరాత్రి నుంచి 'భరోసా' డబ్బులు!
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) గణతంత్ర దినోత్సవం రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుభరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Atmiya Bharosa) పథకాలకు సంబంధించిన సాయం(Benefit)పై లబ్ధిదారులైన రైతులు, భూమిలేని కూలీలలో ఉత్కంఠ నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) గణతంత్ర దినోత్సవం రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుభరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Atmiya Bharosa) పథకాలకు సంబంధించిన సాయం(Benefit)పై లబ్ధిదారులైన రైతులు, భూమిలేని కూలీలలో ఉత్కంఠ నెలకొంది. తమకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం ఎప్పుడు అందుతుందోనని వారు ఆసక్తిగా ఎదురుచూపులు పడుతున్నారు. ఆ పథకాల డబ్బులు(Money) లబ్ధిదారుల అకౌంట్ల(Accounts)లోకి అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని అధికారు చెబుతుున్నారు.
రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరాకు రూ. 6వేలు అకౌంట్లలో జమ కానున్నాయి. అలాగే ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా రూ.6వేలను అకౌంట్లలో వేయనున్నారు. నేడు ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు రైతు భరోసా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే తొలి రోజు ఎకరంలోపు, ఆ తర్వాత ఎంకరంన్నర, రెండెకరాలు ఇలా విడతల వారీగా 'ఈ కుబేర్' విధానం ద్వారా ఖాతాల్లో నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఆదివారం ఒకేసారి ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ పథకాలను లాంచనంగా ప్రారంభించింది. పథకాల లబ్ధి కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగించనుంది. ఈ నాలుగు పథకాలు ఆదివారం ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేస్తారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా సహాయం, భూమిలేని నిరుపేదలకూ, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం అందించనుంది.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలను సరిచేసుకొనేందుకు అవవసరమైన పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా గుర్తించిన సాగుకు పనికిరాని భూముల విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తీసివేస్తున్నారు.
తహశీల్దార్లు, సీసీఎల్ఏకు చెందిన జాబితాల్లోనూ ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. కేవలం సేద్యం చేయడం లేదని మాత్రమే జాబితాలో పేర్కొంటారు కానీ పట్టా భూముల వివరాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఒకే సర్వే నంబరులో కొంత సాగుయోగ్యమైనది, మరికొంత సాగుకు యోగ్యం కాని భూమి ఉన్నప్పుడు ఆ వివరాలను తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు విభజిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ పని పూర్తి చేసి రైతులకు రైతు భరోసా పంపిణి చేపడుతారు.






