నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఒకప్పటి యాక్షన్ హీరో.. ఎన్నికల్లో గెలిపించాలంటూ సెల్ఫీ వీడియో

by Ajay Maddhiboyina |

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఒకప్పటి యాక్షన్ హీరో.. ఎన్నికల్లో గెలిపించాలంటూ సెల్ఫీ వీడియో
X

దిశ‌, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పులిబిడ్డ పులే అవుతుంది కానీ పిల్లి అవ్వదు.. కాబట్టి నీవీన్ యాదవ్ టైగర్ అని కొనియాడారు.

నవీన్ యాదవ్‌కు మంచి భవిష్యత్, గొప్ప పేరు ఉందని నమ్ముతున్నానని అతడి రాజకీయ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే నవీన్ యాదవ్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అంజన్ కుమార్ యాదవ్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ కు టికెట్ వరించింది. యువనేత కావడం, యువతలో క్రేజ్ ఉండటంతో పాటు చాలా కాలంగా నవీన్ పార్టీలో చురుకుగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అతడి గెలపుపై పార్టీ ధీమాతో ఉంది.

Next Story