డీజీపీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు డీజీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

డీజీపీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు డీజీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఏఐజీ రమణకుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏఐజీ రమణ్ కుమార్ మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. ఆయన సేవలు, సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. పోలీసు శాఖలో పని చేసే ప్రతి ఒక్కరూ భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను కొనసాగించేలా పనిచేయాలని అన్నారు.

Next Story