- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: ములుగు ఎన్‌కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు కీలక నేత భద్రు?
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామంలో భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది.

దిశ, వరంగల్ బ్యూరో: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామంలో భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇందులో కీలక నేత భద్రు కూడా హతమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు చెల్పాక వద్ద ఎదురుపడటంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులంతా ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది.
ఘటనా స్థలంలో రెండు AK-47 రైఫిల్స్ పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శితో పాటు ఆయన అన్నను పోలీస్ ఇన్ఫార్మెర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పోలీస్ బలగాల.. ములుగు జిల్లా ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. ఈక్రమంలోనే ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.






