CP Sajjanar: జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు.. హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ హెచ్చరిక

by Ramesh Naini |

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ స‌జ్జ‌నార్‌ నకిలీ వాట్సాప్‌ ఖాతాల విషయంలో ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

CP Sajjanar: జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు.. హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ స‌జ్జ‌నార్‌ (VC Sajjanar) నకిలీ వాట్సాప్‌ ఖాతాల విషయంలో ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తన ఫోటోను ప్రొఫైల్‌ డీపీగా పెట్టుకుని కొంత మంది సైబర్‌ నేరగాళ్లు తెలిసినవారికి సందేశాలు పంపిస్తున్నారని సజ్జనార్‌ శనివారం ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. ‘జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు, వాట్సాప్‌లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు.. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి’ అని సూచించారు.

సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దని సజ్జనార్ తెలిపారు. డబ్బులు అడిగితే పంపించొద్దని, సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దని తెలిపారు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. (Fake WhatsApp accounts) ఒక నకిలీ ఖాతా తన పేరుతో మెసేజ్‌ పంపిన స్క్రీన్‌షాట్‌ను సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తూ నెటిజన్‌లను అప్రమత్తం చేశారు. ట్వీట్ ఇదే..

Next Story