- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు (Betting Apps Promotion Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు (Betting Apps Promotion Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ నోటీసులు అందుకున్న ప్రముఖ సినీనటుడు దగ్గుబాటి రానా (Daggubati Rana) ఇవాళ ఈడీ (ED) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి జూన్ 23న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ, ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లుగా అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో రానాను ఈడీ ఇవాళ (ఆగస్టు 11న) విచారణకు హాజరకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్‌లను అధికారులు విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. ప్రకాశ్‌రాజ్‌ను సుమారు ఆరు గంటల పాటు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు అధికారులు విచారించారు. ఎల్లుండి ఇదే కేసులో మంచు లక్ష్మి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది.






