- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad Metro Rail : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. హైదరాబాద్ మెట్రోకు బిగ్ షాక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలకు కూడా పోలీసుల నుంచి నోటీసులు అందాయి. మొత్తం 25 మందికి పైగా నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, యూట్యూబ్ స్టార్స్ పై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులో హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail)కు కూడా గట్టి షాక్ తగిలింది. మెట్రో రైళ్లలోనూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసారంటూ.. మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. న్యాయవాది నాగూర్‌బాబు ఈ పిల్ వేశారు. ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన మెట్రో రవాణా సంస్థ ఇలాంటి ఇల్లీగల్ పనులకు పాల్పడటంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.
అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎస్, డీజీపీ, మెట్రో ఎండీతోపాటు ఈడీలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈనెల 24కు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ను నమ్మి, లక్షల్లో డబ్బులు మోసపోతూ అనేకమంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ.. ఈ యాప్స్ పై, అలాగే వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవలంటూ పంజాగుట్ట, మియాపూర్ పోలీసు స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులకు నోటీసులు పంపించగా.. మరికొంతమందిని విచారించారు.






