- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భయ్యా సన్నీయాదవ్‌కు పాకిస్థాన్ ఎఫెక్ట్.. చెన్నైలో అరెస్ట్ చేసిన NIA?
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు (Betting Apps Promotion Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో బుక్కైన భయ్యా సన్నీయాదవ్ (Bhayya Sunny Yadav)కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఇవాళ అతడిని ఎన్ఐఏ (NIA) అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టు(Chennai Airport)లో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భయ్యా సన్నీయాదవ్ ఇటీవలే పాకిస్తాన్ (Pakistan)లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే రెండు నెలల వరకు ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో (Social Media)లో పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయడకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ చేసింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ, భయ్యా సన్నీయాదవ్ నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఇటీవలే పాకిస్తాన్‌లో బైక్ రైడ్ వీడియోలను అప్‌లోడ్ చేశాడు.
అయితే, ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్‌ను ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడిని నేరుగా ఢిల్లీలోని ఎన్‌ఐఏ (NIA) కార్యాలయానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు స్పైగా వ్యవహరించిందనే అనుమానంతో ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారుల దృష్టి భయ్యా సన్నీ యాదవ్ పై పడింది. దీంతో పది రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు భయ్యా సన్నీయాదవ్ రెండు నెలలు పాకిస్థాన్‌లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షల్టర్ ఇచ్చింది ఎవరు? పాకిస్థాన్‌లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సిందూర్ జరుతుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేశాడు? అనే విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్థాన్‌లో రెండు నెలల దిన చర్యపై కూపీలాగుతున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ టూర్‌పై విమర్శలు రావడంతో భయ్యా సన్నీయాదవ్ ఇటీవలనే ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై కొంతమంది తప్పులు వీడియోలు, వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్ముల్ని బాధపెట్టేవారిపై తాను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాడు.
కాగా, మరోవైపు యువతను పెడదోవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మార్చి 22న భయ్యా సన్నీయాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, అతడు అప్పటికి విదేశాల్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టులలో లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. దీంతో సన్నీయాదవ్ అప్పటి నుంచి తన సొంత గ్రామమైన నూతన కల్‌కు రాకుండా పరారీలో ఉన్నాడు. ఇదే కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే సన్నీయాదవ్ కోర్టును ఆశ్రయించిన మనందరికీ తెలిసిందే.






