- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన హీరో విజయ్ దేవరకొండ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు (betting apps promotions case)లో ఈడీ విచారణ (ED investigation) కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన ఈడీ.. ఈ రోజు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ ఈడీ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో మనీలాండరింగ్ కోణంలో విజయ్ ను ఈడీ అధికారులు (ED officials) ప్రశ్నించనున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు వారి అందుకున్న పారితోషికాలు, కమీషన్లపై ఈడీ విచారణ చేపట్టనుంది. కాగా ఇదే కేసులో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని హీరో దగ్గుబాటి రానా, ఆగస్టు 13న మంచు లక్ష్మీకి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story






