- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మాంజా ఉచ్చులో విలవిల.. కాపాడిన ఖాకీలు ! ట్రాఫిక్ పోలీసుల మానవత్వం
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు.. ఆపదలో ఉన్న ఓ మూగజీవి పట్ల స్పందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు.. ఆపదలో ఉన్న ఓ మూగజీవి పట్ల స్పందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నిషేధిత మాంజా కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గద్దను సురక్షితంగా కాపాడి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేట ప్రాంతంలో ఓ చెట్టు కొమ్మకు చిక్కుకున్న చైనీస్ మాంజా (నిషేధిత దారం) కారణంగా ఓ గద్ద ఎగరలేక, కొమ్మకు వేలాడుతూ గిలగిలా కొట్టుకోవడం అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఉన్నతాధికారుల కంటపడింది. అదనపు డీసీపీ లక్ష్మి, ఏసీపీ శంకర్ రాజు తక్షణం స్పందించారు. ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో ఆ గద్దను కిందకు దించి, దాని రెక్కలకు బలంగా చుట్టుకుపోయిన మాంజా దారాన్ని జాగ్రత్తగా తొలగించి విడిపించారు.
అధికారుల విజ్ఞప్తి..
గద్దను రక్షించిన అనంతరం అధికారులు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పక్షుల పాలిట యమపాశంలా మారుతున్న నిషేధిత చైనీస్ మాంజాను ఎవరూ వాడవద్దని కోరారు. పర్యావరణ పరిరక్షణ, పక్షుల రక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు గద్దను రక్షిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు చూపిన చొరవను, సమయస్ఫూర్తిని నెటిజన్లు, జంతు ప్రేమికులు ప్రశంసించారు.






