BJP ఎంపీలు చేతకాని దద్దమ్మలు.. బీర్ల అయిలయ్య ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎంపీలపై ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP ఎంపీలు చేతకాని దద్దమ్మలు.. బీర్ల అయిలయ్య ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎంపీలపై ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వైఖరితో ఆ పార్టీ బీసీ వ్యతిరేకి అని తేలిపోయిందన్నారు. బీసీ వ్యతిరేకిగా బీజేపీపై ముద్ర పడిందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావొద్దదన్నదే రాంచందర్ రావు వైఖరి అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారనే ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోతున్నారని మండిపడ్డారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో పోరాడటం లేదు.. చేతకాని దద్దమ్మలుగా మారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కగా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు..? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే వారిని సహించం అని మండిపడ్డారు.

Next Story