- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మాకు కావాల్సిన పదవులు ఇవే’.. ప్రభుత్వం ఎదుట బీర్ల అయిలయ్య కీలక డిమాండ్స్
తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎప్పుడూ గొల్ల, కురుమ సామాజికవర్గానికి చెందిన ఒకరు కేబినెట్‌లో మంత్రిగా ఉండేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో యాదవ కులస్థులు 22 లక్షలు, కురుమ కులస్థులు 6 లక్షల మంది ఉన్నారని తెలిపారు. గొల్ల, కురుమలకు మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారుడు, ఒక ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు, ఐదు కమిషన్ సభ్యులు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్స్, 8 జనరల్ సెక్రటరీలు, 5 DCCలు ఇవ్వాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగినా.. అందులో గొల్ల, కురుమలకు అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పెద్దపీట వేశారని కొనియాడారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) వచ్చే పార్టీ పదవులలో గొల్ల, కురుమలకు తప్పక అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.






