- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ముంది: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం అంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్ర లు వెళ్ళినట్లు ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం అంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్ర లు వెళ్ళినట్లు ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అత్యంత నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపులు చేసిన కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని, 10 ఏళ్లలో 60 మందికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఎందుకు పార్టీలకు పార్టీలను బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారని, ఆనాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా గెలిపించే దమ్ము మా సీఎం రేవంత్ రెడ్డికి ఉందని, మీ దమ్ము ఏమిటో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించాలని బీర్ల ఐలయ్య సవాల్ చేశారు.
తాము స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా మేము భావిస్తామని, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా అద్భుతంగా పని చేస్తుంటే దానిపైన కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. పదేళ్ళలో మీరు చేయని పని ఇప్పుడు ప్రజాపాలనలో జరుగుతున్నాయని, ప్రజాదరణ చూసి ఓర్వలేక కేటీఆర్చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. యూరియా ఎవరిస్తే వారికి ఓటు అని కేటీఆర్మాట్లాడుతున్నారని, యూరియా ఎవరిస్తారో ఆయనకు తెలియదా అని బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. తమ అగ్రనేత ప్రియాంక గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో యూరియా కోసం నిరసనలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. మీరు ప్రతిపక్ష హోదాను నిర్వహించాలని, కానీ, చచ్చిన పార్టీని బ్రతికించే మీ చర్యలు అందరు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణలో మీ దుకాణాలు బంద్ అయ్యాయని, కేటీఆర్ ఇట్లాగే చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని అన్నారు.






