- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీశ్‌రావు పోరాట యోధుడిలా ఫోజులిస్తున్నారు.. బీర్ల ఐలయ్య ఫైర్
మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి పోరాటయోధుడిలా పోజులు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి పోరాటయోధుడిలా పోజులు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ రోజు సిట్ విచారణకు హాజరవుతూ ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతున్నాడని మండిపడ్డారు. మీ ఇంటి ఆడబిడ్డ కవితనే ఎంతోమంది ఫోన్ల ట్యాప్ చేశారని చెప్పారన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే దానికి సమాధానం చెప్పలేదన్నారు.
పదేళ్లు ఎక్కడ చూసినా తెలంగాణను దోపిడీ చేసి తెలంగాణ ఉద్యమ కారుల మీద కేసులు పెట్టి అణగదొక్కాలని చూశారన్నారు. మీ స్కాములు చూసే ప్రజలు ఓడించి ఇంటికి పంపిచారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మీరు తిన్నది రేవంత్ రెడ్డి కక్కిస్తారని వ్యాఖ్యానించారు. అధికారులు, రాజకీయనాయకులు, భార్యభర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. తప్పకుండా మీ బండారం బయటపడుతుందని మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.






