ఆ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయా.. సింగర్ ఆవేదన!

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-15 12:55:56  IST  )

ప్రముఖ గాయని మంగ్లీ గురించి సుపరిచితమే.

ఆ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయా.. సింగర్ ఆవేదన!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ గాయని మంగ్లీ గురించి సుపరిచితమే. ఇటీవల సోషల్ మీడియా(Social Media) వేదికగా సింగర్ మంగ్లీ(Singer Mangli) పై పలు ఆరోపణలు రావడంతో ఆమె స్పందించారు. ఈ క్రమంలో ఆమె తాజాగా బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో తానొక కళాకారిణిగా పాల్గొన్నట్లు సింగర్ మంగ్లీ తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ(YSRCP)కి చెందిన కొందరు నేతలు సంప్రదిస్తే పాట పాడాను. ఒక ఆర్టీస్టుగా మాత్రమే పాట పాడానని ఆమె తెలిపారు. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో ప్రచారం(campaign) కూడా చేశాను. అయితే అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.

కానీ.. ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు. నేను ఎక్కడ పార్టీ జెండా ధరించి క్యాంపెయిన్ చేయలేదు. ఏ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఆ సమయంలో ఒక వైసీపీకి మాత్రమే కాదు.. పలు పార్టీలకు పాటలు పాడిన అని ఆమె తెలిపారు. ఈ క్రమంలో నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు పాడ లేకపోయాను. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను. కొన్ని సమయాల్లో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

గత సంవత్సరం(2024) ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరిన సున్నితంగా తిరస్కరించానని ఆమె పేర్కొన్నారు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను. ఈ క్రమంలో నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సింగర్ మంగ్లీ తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు గారికి నేను పాట పాడను అనేది నిజం కాదని ప్రమాణం చేస్తున్నాను అన్నారు.

ప్రారంభంలో వైసీపీకి పాడిన కారణంగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీ(TDP)కి చెందిన ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని ఆమె కోరారు. ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story