- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్వాంగ సుందరంగా ముస్తాబైన పోలింగ్ కేంద్రాలు.. ఫిదా అవుతున్న ఓటర్లు
నేడు రాష్ట్రంలో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 3,752 గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రంలో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 3,752 గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా వరంగల్ జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లు ఓటర్లను అబ్బురపరుస్తున్నాయి.
లక్నేపల్లి, ఖానాపూర్, రాగంపేట, ఉప్పరపల్లి, తిమ్మరాయనిపహాడ్, ఇటుకాలపల్లి, అలంకాణిపేటలోని పోలింగ్ కేంద్రాల ముందు ముగ్గులు వేసి, పచ్చని తోరణాలు కట్టారు. పూల దండలు కట్టి పచ్చదనంతో గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడుతున్నారు. సాధారణంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిలబడి ఓటు వేయాలంటే ఓటర్లు నిరుత్సాహ పడతారు. కానీ పచ్చదనం, రంగులతో సంక్రాతి సంబరాల మాదిరిగా పోలింగ్ కేంద్రాలు కనిపించడంతో ఓటర్లు ఎగబడి మరీ వస్తూ ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.






